అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరం అయ్యే వరకు పోరాడుతామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిస్కారం చేయాలని కోరు తూ సీఐటీయూ,ఏఐటీయూసీ అద్వర్యం లో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శిం చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ
కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తుంటే వారి సమ్మెను విచిన్నం చేసే ప్రయత్నం ప్రభు త్వం చేస్తున్నదని ఎద్దేవా వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులుకట్ల. చారి, నంది. రమణ, పి. రత్నకుమారి, వీ. ప్రేమమ్మ, బి. సడాలమ్మ,
స్వరూప, భిక్షావతి, విజయనిర్మల, సరిత,టీవీ కె.మీనా,వి. అరుణ కుమారి బి.కుమారి,కె.సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]