గురు న్యూస్ విశాఖపట్నం : పెందుర్తి నియోజకవర్గం 96 వ వార్డు 516 సచివాలయం పరిధి కామాక్షమ్మ కాలనీ, నల్ల క్వారీ కాలనీ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెందుర్తి వైసీపీ శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆదిప్ రాజ్ ,హాజరయ్యారు.ముందుగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ కి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని అనేక సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తు చేశారు.పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.కాలనీవాసులును అడిగి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.. అక్కడున్న సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులకు సూచించారు.. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు మహిళలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం, ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.. నల్ల క్వారీ శివాలయానికి అభివృద్ధికి తన వంతు సాయంగా లక్ష రూపాయలు చేక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అదీప్ రాజ్ ను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
[zombify_post]