చర్ల మండలంలోని కలివేరు, కత్తిగూడెం,కొయ్యురు గ్రామ సమీపంలో రహదారి అధిక లోడు వాహనాలతో ధ్వంసమైంది. ఇసుక రీచ్ నుంచి నిత్యం లారీలు, టిప్పర్లు వందలాది అధికలోడుతో వెళుతుండటంతో రహదారి ధ్వంసమైంది. రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రమాదాలు గురై అవకాశం ఉంది అని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినా కూడా అధికారుల్లో చలనం కలగడం లేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పట్టా పగలే అధికలోడుతో ఇసుకను తరలిస్తున్న వాహనాలు రహదారులపై తిరుగుతున్నా సంబంధిత అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేపట్టి, అధిక లోడుతో వెళుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
[zombify_post]