చర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుకు పొడియం జ్యోతి అనే 22 ఏళ్ళ మహిళ కన్ను మూసింది. పాము కాట్లు క్రాంతీపురం వాసులను బెంబేతెత్తిస్తున్నాయి. చర్ల మండలం సుబ్బంపేట గ్రామపంచాయతీ పరిధిలో క్రాంతి పురం గ్రామానికి చెందిన పొడియం జ్యోతి (22) అనే మహిళను శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంటివద్ద పాము కరిచింది. ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చర్లలో ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేకపోవటంతో భద్రాచలం ఏరియ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే జ్యోతి మరణించింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముకాటు కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవసరమైన ఇంజక్షన్లు ఏర్పాటు చేయకపోవటం శోచనీయం అని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో పాములు ఎక్కువగా ఉంటున్నాయి అని సరైన కరెంట్, రోడ్డు సదుపాయం లేకపోవడం వాళ్ళ ఈ పరిస్థితి వచ్చిందని క్రాంతి పురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
[zombify_post]