in ,

దేశానికి వైద్యం అందించే స్థాయికి తెలంగాణ ఎదిగింది..*

కరీంనగర్ జిల్లా:

*దేశానికి వైద్యం అందించే స్థాయికి తెలంగాణ ఎదిగింది..*
*తెలంగాణ చరిత్రలో అద్భుతమైన రోజు…*

*వర్చువల్ గా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన సీఎం కెసిఆర్…*

*రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్….*

ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించు కున్న ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన దినంగా సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శుక్రవారం హైదరాబాద్ ప్రగతి భవన్ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి అధికారులతో కలిసి నూతనంగా నిర్మించిన 9 ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యా బోధన తరగతులను వర్చువల్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ బి గోపి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ సుంకే రవిశంకర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో ఈరోజు అద్భుతమైన రోజని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టంగా నేటి ప్రారంభోత్సవాన్ని మంత్రి అభివర్ణించారు. గతంలో వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, ఫిల్లిప్పిన్స్ తదితర దేశాలకు వెళ్లి చదివేవారని, గతంలో 5 వైద్య కళాశాలలు ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎంబిబిఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే
ప్రస్తుతం4490 సీట్లకు పెరిగాయని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రస్తుత సంవత్సరం 9 వైద్య కళాశాలలు ప్రారంభించుకున్నాం , వచ్చే విద్యా సంవత్సరం 8 వైద్య కళాశాలల ఏర్పాటుకు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. వైద్యరంగం పటిష్ట పరిచేందుకు వైద్యులతో పాటు సమాంతరంగా నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ సిబ్బంది సైతం కీలకమని పేర్కొన్నారు. దేశానికి వైద్యం అందించే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి అన్నారు. వైద్య విద్యార్థులు బాగా చదవాలని, పైన ఇబ్బందులు ఉంటే వెంటనే అధికార దృష్టికి తేవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందన్నారు.

అంతకుముందు రేకుర్తి బ్రిడ్జి వద్ద మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ రేకుర్తి బ్రిడ్జి నుండి ప్రభుత్వ వైద్య కళాశాల వరకు వేలాదిమంది వైద్య, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఎన్సిసి క్యాడెడ్స్, ఆర్మీ, స్వయం సహాయక సంఘ బృందాలతో భారీ ర్యాలీ వెళ్ళింది. అనంతరం వైద్య కళాశాలలో విద్యార్థులచే సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర  ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, నగర్ మేయర్ వై సునీల్ రావు , ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పౌరసరఫరాల శాఖ చైర్మెన్ సర్ధార్ రవీందర్ సింగ్, రాష్ట్ర టీవీ మరియు చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ కుర్మాచలం అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీష్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్.బి గోపి, సిపి సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు  ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితా దేవి, సుడా  చైర్మెన్ జి వి రామకృష్ణ రావు,జిల్లా  గ్రంధాలయ సంస్థ చైర్మెన్ పొన్నం అనిల్ గౌడ్, AMC  చైర్మెన్ రెడ్డవేణి మధు కార్పొరేటర్లు, కొత్తపళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Rajendra

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts

రూ. 1కోటి 10 ల‌క్ష‌ల ఆస‌రా పంపిణీ

అందినకాడికి దోచేయ్.. అదును చూచి మెడికల్ షాపులు, ఆర్ఎంపిల, అడ్డగోలు దోపిడీ