పాడేరు అల్లూరి జిల్లా: జిల్లాలో గత మూడు విడతల్లో వై ఎస్ ఆర్ ఆసరా మంజూరు కాని 60 గ్రూపులకు రూ.1కోటి 12 లక్షల వై ఎస్ ఆర్ ఆసరా చెక్కును ఐటిడి ఏ పి ఓ వి. అభిషేక్ శుక్రవారం ఆయన కార్యాలయంలో లబ్దిదారులకు పంపిణీ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న ఆర్దిక ఆసరాను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని పి ఓ సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిడి వి. మురళి, వెలుగు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]