కరీంనగర్ జిల్లా19లోగా ఓటరు జాబితాపై చర్యలు పూర్తికావాలి
బిఎల్ఓ లు డోర్ టు డోర్ సర్వే ద్వారా ఓటర్ల దృవీకరణ చేపట్టాలి
జెండర్ రేషియో, పిడబ్ల్యూడి ఓటర్లను సమీక్షించుకోవాలి
ప్రతి వేయి మందికి ఒకరి చోప్పున స్కృటిని అధికారిని నియమించడం జరిగింది
2020 నాటికి పదవతరగతి పూర్తిచేసుకున్న వారందరు ఓటర్లుగా నమోదై ఉండాలి
జిల్లా కలెక్టర్ డాః బి. గోపి
. 0 0 0 0 0
జిల్లాలో సెప్టెంబర్ 19 లోగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాః బి. గోపి తహసీల్దార్లను ఆదేశించారు.
గురువారం కలక్టరేట్ సమావేశ మందిరం నుండి ఓటర్ల నమోదు, సవరణలు తదితర అంశాలపై అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లా కలెక్టర్ డాః బి. గోపి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డిఓలు, తహసీల్దార్ లకు దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తుది ఓటరు జాబితా రూపొందిచడంలో భాగంగా అర్హులైన ప్రతిఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయడానికి స్పెషల్ క్యాంపేయిన్ లను నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా 18 సంవత్సరాలు పైబడిన వారందరు ఓటర్లుగా గుర్తించబడాలని అన్నారు. గత అసెంబ్లి ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ప్రస్తుత జాబితాను సరిచూసుకోని గ్యాప్ లేకుండా చూడాలన్నారు. కోన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో 20 కన్నా తక్కువ నుండి సున్నా వరకు 18 సంవత్సరాలు పైబడిన నూతన ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని, ఆ పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ ఓ లు సమీక్షించుకోవాలని, డోర్ టు డోర్ సర్వే ద్వారా బిఎల్ఓ లు ఓటర్ల వివరాలను సరిచూసుకోవాలని, జాబితాలో లేని వారినుండి ఫామ్-6 ద్వారా నమోదు చేయాలని తెలిపారు. స్పెషల్ క్యాoపెయిన్ ద్వారా వచ్చిన ఫామ్ 6,7, 8 ల ఫిజికల్ కాపీలను బిఎల్ఓలు తహసీల్దార్ లకు అప్పగించాలని సూచించారు. అదే విధంగా జిల్లాలో 2020 నాటికి పదవ తరగతి పూర్తిచేసుకున్న వారి జాబితా ఆదారంగా పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న నూతన ఓటర్ల వివరాలను సరిచూసుకొవాలని, చదువుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను సైతం ఫామ్-6 ద్వారా నమోదు చేయాలన్నారు. అదే విధంగా జిల్లాలో మహిళలు, పురుషుల ఓటర్ల వివరాలను కూడా సరిచూసుకోవాలని, వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారి జాబితా ఆధారంగ పోలింగ్ కేంద్రం పరిదిలో ఓటర్లుగా నమోదై ఉన్న వారందరికి ఆయా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన చర్యలు చేపట్టాలని, అదే విధంగా జాబితాలో లేని వారిని ఫామ్-6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని సూచించారు.
ఓటరు జాబితాలో పొరపాటున తొలగించిన ఓటర్ల వివరాలను సరిచూడడానికి ప్రతి వెయిమందికి ఒక క్లస్టర్ అధికారిని నియమించడం జరిగిందని తెలిపారు. తహసీల్దార్ లు బిఎల్ఓ లతో సమావేశాలను నిర్వహించి అర్హులైన వారందరిని ఓటర్లుగా గుర్తించబడేలా క్షేత్రస్థాయిలో పరిశీలించేలా ఆదేశాలను జారీచేయలని, బిఎల్ఓ ల ద్వారా వచ్చిన ఫామ్ లు తహసీల్దార్ కార్యాలయంలోని ఆపరేటర్ ద్వారా వెంటవెంటనే లాగిన్ లో నమోదు చేసి చర్యలు తీసుకునేలా చూసుకోవాలని ఆదేశించారు. ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 19 లోగా అర్హులైన వారందరు ఓటరు జాబితాలో ఉండాలని, ఎటువంటి పోరపాట్లకు ఆస్కారం లేకుండా ఉండే ఖచ్చితమైన తుది ఓటరు జాబితాను రూపొందించడంలో నిబద్దతతో విధులు నిర్వహించాలని, అలస్యత్వం వహిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, జాబితాలో ఫోటో, పేరు, చిరునామ ఇతర వివరాల సవరణ, బదిలి కొరకు వచ్చిన ప్రతి ఫారములను ఏరోజుకారోజు చర్యలు తీసుకోబడాలని, అదే విధంగా డాటా ఎంట్రి కూడా వెంటనే జరగాలని సూచించారు. దరఖాస్తులలో ఎటువంటి పెండింగ్ లేకుండా సెప్టెంబర్ 19 లోగా వచ్చిన ప్రతి దరఖాస్తు డాటా ఎంట్రి పూర్తియిపోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఇంచార్జ్ డిఆర్ఓ పవన్ కుమార్, కలక్టరేట్ ఎలక్షన్ అధికారులు పాల్గొన్నారు
[zombify_post]