ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలి అని ఏబీవీపీ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు .ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే ప్రధాన రోడ్డు విద్యార్థులు వెళ్లకుండా తీవ్ర ఇబ్బందిగా ఉందనీ,చినుకు పడితే వారం రోజులు అయినా తగ్గకుండా దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు నిలువ ఉండి నిత్యం ప్రజలకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. అనంతారం బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో ప్రజలకు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కు ప్రహరీ గోడ లేక అందులో దొంగలు పడి ఫర్నిచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేసారన్నారు . అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ కళాశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు.ప్రభుత్వ జూనియర్ కాళశాల ప్రహరీ గోడ నిర్మానించాలనీ , అనంతారం బిక్క వాగు నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలనీ , విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కూనబోయిన ప్రవీణ్,అవినాష్ , కిరణ్, సాయి, సమీర్,దినేష్, విజయ్, రామ్ చరణ్, ప్రవీణ్, నాగరాజు, వినయ్, నవీన్, అరవింద్, రాకేష్ విద్యార్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

[zombify_post]