దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని పివైఎల్ నాయకులు పేర్కొన్నారు.గురువారం ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులారా పోరాడుదమని,ఈ దేశాన్ని ఈ దేశం మొత్తం కార్పొరేట్ కబంధహస్తాల్లోకి పోతుందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరం మీదనే ఉన్నదని దేశంలో మొత్తం హిందూ మతోన్మాదం శక్తులు నిర్మితమవుతున్నాయని తెలిపారు.యువతరానికి ఇదే మంచి తరుణం అని సూచించారు.ఈ కార్యక్రమంలో పివైఎల్ నాయకులు రాజు,సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు వైఎస్ రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వీరమల్ల ఉమా పిఓఎల్ జిల్లా నాయకులు బర్ల రామకృష్ణ శ్రీకాంత్ మహేష్ ప్రశాంత్ ,రాజు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]