సత్తుపల్లి మండలం గంగారంలో నకిలీ విత్తనాలతో మోసం మోసపోయామంటూ రైతులు ఆందోళన చేపట్టిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. సత్తుపల్లిలోని కాకర్లపల్లి రోడ్డులోని తెలంగాణ ఆగ్రోస్ దుకాణంలో తాము వరుణ్ సీడ్ కంపనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేపట్టాము. 160 రోజుల పంట కాలం కాగా సగం రోజులకే సగం పంట పొట్ట దశకు చేరింది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన తాము పంటను పూర్తిగా నష్ట పోవాల్సిందేనని, తమను ప్రభుత్వమే అదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. కాగా ఇదే విషయమై వ్యవసాయ అధికారుల వివరణ కోరగా పంట నమూనాలను పరీక్షలు నిమిత్తం పంపించామని శాస్త్రవేత్తల ద్వారా పరీక్షిస్తున్నట్లు తెలిపారు.
[zombify_post]