in ,

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం*

  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్  ఆదేశాల మేరకు వేములవాడ డిఎస్పి నాగేంద్రచారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెట్టేకుంటా గ్రామంలో ఈరోజు ఉదయం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ సందర్భంగా  డిఎస్పీ  మట్లాడుతు… ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమo నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని, సరైన  నంబర్ ప్లేట్స్ లేని 34 ద్విచక్ర వాహనాలు ,02 ఆటోలు సీజ్ చేయడం జరిగిందని సబంధించిన వాహన దారులకు సరైన పాత్రలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా  అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు  ఫోన్  చేసినచో  వెంటనే చర్యలు చేపడతామని అన్నారు.గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు.అదేవిధంగామొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేయండి. పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుంది.ఈ యొక్క కార్యక్రమo తరుచుగా నిర్వహిస్తామని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గాంజా, గుడుంబా రవాణా మరియు విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
    ఈ కార్యక్రమంలో సి.ఐ లు కరుణాకర్, కృష్ణకుమార్, ఎస్.ఐ ఆర్.ఎస్.ఐ లు డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ ను దగ్దం చేసిన నాయకులు

చేతల ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టండి”