డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ టిడిపి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ లో పాల్గొన్నారు.జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ టిడిపి శ్రేణులకు భరోసా ఇస్తూ కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలో టిడిపి నాయకులు చేసిన బంద్ లో నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులుతో కలిసి శాంతియుతంగా బంద్ లో పాల్గొనడం జరిగింది.నాయకులు మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా తలపెట్టిన కొత్తపేట నియోజకవర్గ బంద్ కు వర్తకసంఘాలు, వ్యాపారులు, కార్మికులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల వారు సహకరించారని అన్నారు.అభివృద్ధి, సంక్షేమం శ్వాసగా పని చేస్తూ టెక్నాలజీని యువతరంలో కొత్త పుంతలు తొక్కించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని ఇనుముడింప చేసిన నారా చంద్రబాబు నాయుడు ని రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చేయడాన్ని బంద్ ద్వారా ప్రతి ఒక్కరూ ఖండించారు.రానున్న రోజుల్లో చేసిన తప్పులకు బాధపడుతూ పచ్చాతపం పడతావు జగన్ అని హెచ్చరించారు. ఈ బంద్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
[zombify_post]