సాగునీటి సమస్యను 24 గంటల్లో పరిష్కరిస్తాం
పోలాకిమండల పరిధి కుసుమపాలవలస, చల్లబంద, రాళ్లపాడు పరిసర ప్రాంతాల్లో పొలాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టి 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. పోలాకిలో బుధవారం ఆయన మాట్లాడుతూ తెదేపా హయాంలో చేపట్టిన నీరు – చెట్టు పనులతో ప్రస్తుతం సాగునీటికి రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శివారుకు నీరు అందడం లేదని ఎమ్మెల్యే తెలిపారు.
[zombify_post]
