in , ,

హస్తమే దేశ భవితకు అభయ హస్తం

దేశాన్ని ఐక్యం చేయుట కొరకు  భావి ప్రధాని పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ కన్యాకుమారి టూ కాశ్మీర్ వరకు, ఎండనక వాననక చలనకా. చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో సంవత్సరం పూర్తి చేసుకుందని అన్నారు. సత్తుపల్లి పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివ వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోళ్ళ అప్పారావు ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహమునికి పూలమాల వేసి నివాళి అర్పించి పాదయాత్ర చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలవేసి నివాళులర్పిచరు.  భారత్ జోడో యాత్రకి సంఘీభావంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ హస్తమే దేశ భవితకు అభయ హస్తమని చాటుతూ, విద్వేషం నిండిన బీజేపీ నియంతపాలన వారి కుతంత్రాలను బయటపెడుతూ దేశ ప్రజల ప్రేమను కోరుతూ, దేశ సమగ్రత కొరకు అగ్రనేత, భావి ప్రధాని *శ్రీ రాహుల్ గాంధీ* గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు నాలుగు వేల కిలమీటర్లు *భారత్ జోడో యాత్ర* చేపట్టి చరిత్ర సృష్టించారని తెలిపారు.

ఈ యాత్ర ద్వారా బీజేపీ పార్టీలో వణుకు మొదలైందని అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు వారి యాత్ర ఫలితమేనని త్వరలో తెలంగాణలో కూడా ఇదే పునరావృతం అవుతుందని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని  అందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివ వేణు,
సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోళ్ళ అప్పారావు, ఆల్వాత్ వెంకటేశ్వరరావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాలం కృష్ణ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి మున్వర్ హుస్సేన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట రాజేష్, బీసీ సెల్ అధ్యక్షులు రాయల కోటేశ్వరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు జొన్నలగడ్డ, శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు బీర అబ్బులు, మహిళా అధ్యక్షురాలు కనపర్తి కుమారి, పట్టణ మహిళా అధ్యక్షురాలు దొంతు సరోజినీ, నాయకులు హరి ప్రసాద్ రెడ్డి, మెచ్చ రామకృష్ణ, గుంటూరు శివశంకరరావు, దుబ్బాక చందు, నాగుల నాగేశ్వరరావు, మోరంపూడి సత్యం, వేములపల్లి శ్రీనివాసరావు ఎస్.కె నన్నే బాబు, శివ బాబురావు, కే రాజాలు, పి బాబురావు, మడకం ప్రసాద్, కే వెంకటరమణ పి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఇస్కాన్ ఆలయంలో మేజిస్ట్రేట్ పూజలు…

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిపి