దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రభుత్వం లోక్ అదాలత్ లను నిర్వహిస్తోందని దీనిని సద్వినియోగం చేసుకొని కేసుల నుంచి విముక్తి పొందాలని ట్రాఫిక్ ఎస్.ఐ. రామచంద్రము కోరారు. మంగళవారం ట్రాఫిక్ ఎస్.ఐ. మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జాతీయ లోక్ అదాలత్ ఆదేశాలతో జగిత్యాల జిల్లా న్యాయస్థానంలో ఈ నెల 2 నుంచి 9 వరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారన్నారు. వివిధ రకాల కేసులతోపాటు ట్రాఫిక్ కేసులను ఈ లోక్ ఆదాలత్ లో పరిష్కరించుకోవచ్చని ట్రాఫిక్ ఎస్.ఐ. తెలిపారు. జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెండింగ్ చాలనులుకట్టుకొని కేసుల నుంచి విముక్తి పొందవచ్చన్నారు. వాహనదారులు సత్వరమే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ ఎస్.ఐ. రామచంద్రము కోరారు.
[zombify_post]