రాజమహేంద్రవరం- కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న రోడ్డుకం రైలు వంతెన మూతవేతను నవంబరు 10 వరకు కొనసాగిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల నిమిత్తం ఈ వంతెనను గతనెల 27న మూసివేసి ఈ నెల 26 వరకు ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. మరమ్మతు పనులు పూర్తికానందున ఆర్‌అండ్‌బీ అధికారుల అభ్యర్థన మేరకు వచ్చేనెల 10 వరకు వంతెన మూసివేతను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బీటీరోడ్డు పనులు జరుగుతున్నాయని, పూర్తిస్థాయిలో పెయింటింగ్ రోడ్డు మార్కింగ్ తదితర పనులు చేపట్టనున్న దృష్ట్యా ముందుగా ప్రటించిన తేదీ నాటికి వాహనాల రాకపోకలకు అనుమతించడం లేదనే విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని ఆమె కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!