జిల్లా లో మత్య్స రైతులను ప్రోత్సహించే విధంగా 62 మైనర్ ఇరిగేషన్ చెరువులలో 4.255 లక్షల చేప పిల్లలు విడుదల చేయడం ద్వారా వాటి ఉత్పత్తిని మత్య్సకారులకు అందుబాటులోకి తీసుకు రావడం జరుగుతుందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత, జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత లు పేర్కోన్నారు.బుధవారం తాళ్ళపూడి మండలం గజ్జరం గ్రామములో గల కొత్త చెరువులో రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత, జిల్లా కలెక్టరు డా. కె.మాధవీలత అధికారులతో కలసి చేప పిల్లలను విడుదలచేసారు. ఈ సందర్బంగా ఈ హోంమంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ మత్స్య కారులకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి మత్స్యకార భరోసా వంటి పధకాలు ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నారన్నారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగు పరుచుటకు ప్రభుత్వము ఉచితముగా స్టాక్ చేసిన చేప పిల్లల వల్ల 10,257 మంది మత్స్యకారులకు లబ్ది చేకూరుతున్నదనీ పేర్కొన్నారు. పేద మత్స్య సహకార సంఘముల సభ్యుల జీవనోపాధి మెరుగు పరుచుటకు అదనపు ఆదాయము సమకూర్చుటకు ప్రభుత్వము ఉచితముగా చేప పిల్లల స్టాకింగ్ కార్యక్రమము నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 62 మైనర్ ఇరిగేషన్ చెరువులలో చేప పిల్లల విడుదల కార్యక్రమము మత్స్య శాఖ ద్వారా చేపట్టామన్నారు.జిల్లా కలెక్టర్, డా. కె. మాధవీలత చేప పిల్లలను విడుదల చేస్తూ, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమము వలన గ్రామీణ ప్రాంతాల ప్రజలు మంచి ప్రోటీన్ ఆహారము అందుబాటులోకి వస్తుందనీ పేర్కొన్నారు. అలాగే మత్స్య కారులందరూ సహకార సంఘముల ద్వారా సమిష్టిగా చెరువులలో చేపలు పెంచుకొనుట వల్ల వారి ఆర్ధిక సుస్థిరత సాధ్యం అవుతుందనీ సహకార సంఘముల నిభందనల ప్రకారం దళారుల ప్రమేయం లేకుండా మత్స్యకారుల చేపల పట్టుబడి మరియు అమ్మకం చేపట్టుట ద్వారా అదనపు ఆదాయము పొందుటకు అవకాశము కలదనీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో జిల్లా మత్స్య శాఖ అధికారి వి.కృష్ణా రావు, మత్స్య శాఖ సహాయ సంచాలకులు షేక్.దిల్షాద్, మరియు మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి పి.కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ రాంబాబు, సొసైటీ ప్రసిడెంట్ శ్రీనివాసు మరియు సొసైటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
