🔷 రాహుల్ గాంధీ తోనే రైతు రాజ్యం సాధ్యం..!
🔷 రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం…!
🔷 సంక్షేమం, సుపరిపాలన కాంగ్రెస్ పార్టీకే సాధ్యం..!
💥 ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ..
👉 ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు..
👉 ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మెుదటి స్థానంలో ఉందని కాంగ్రెస్ పార్టీ హయాంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశామని కానీ ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని నూతన నిర్మాణాలు లేవని, అధికార పక్షం, ప్రతి పక్షం రాజకీయ కక్షలకు పాల్పడుతూ ప్రజలను విస్మరించారని వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకు పోయిందని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతోనే రైతు రాజ్యం సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హోలగుంద మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రామచంద్ర ను ఎన్నుకున్నట్లు తెలిపారు.
👉 హోలగుంద మండల కేంద్రంగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు దాదాపుగా రెండు సంవత్సరాల వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పారిశుధ్య కార్మికులు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
👉 ఆంధ్రప్రదేశ్ జాప్ అసోసియేషన్ జర్నలిస్టు సంఘం సభ్యులుగా ఎన్నికైన జర్నలిస్టులను కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఘనంగా సన్మానం నిర్వహించారు.
👉 అదే విధంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఆలూరు నియోజకవర్గంలో ప్రవేశించి సంవత్సరం పూర్తి కావస్తున్నా సందర్భంగా ఆలూరు పట్టణంలో ఈ నెల 18వ తేదీన భారి ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు గారు మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు హాజరవుతారని తెలిపారు.
👉 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలూరు తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగం పల్లి రామాంజనేయులు, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, ఎమ్మార్పీఎస్ హోలగుంద మండల అధ్యక్షులు వెంకటేష్, హోలగుంద మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రామచంద్ర, చిప్పగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఖాజీపురం రాంబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి వినోద్ కుమార్, విద్యార్థి సంఘం నాయకుడు హోలగుంద సతీష్, ఎల్లార్థి మహేష్
This post was created with our nice and easy submission form. Create your post!