డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అంబేద్కర్ మహనీయుణ్ణి అవమానించారని ప్రశ్నించిన దళిత యువతకు అన్యాయమే జరిగింది: బండారు సత్యానందరావు
న్యాయానికి సంకెళ్లు వేసి జగన్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ రావులపాలెంలో పదిహేనవ రోజు క్లస్టర్ – 3 (రావులపాలెం, ఊబలంక గ్రామాల) ఆద్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాజకీయ కక్షలతో పరిపాలన సాగిస్తున్నారని, అక్రమ అరెస్టులు, అవినీతే ధ్యేయంగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని కేసు పెట్టి అన్యాయంగా చంద్రబాబు నాయుడని ఇబ్బందులకు గురి చేసి సైకో ఆనందం పొందుతున్నారని అన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా అన్యాయం, అక్రమం, అధర్మం, అవినీతి పేట్రేగిపోతున్నాయని అన్నారు. రావులపాలెం దళిత యువకులను సైతం అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహనీయుణ్ణి అవమానించారని ప్రశ్నించడమే వారు చేసిన నేరమా అని అవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేదించడం జగన్ ను పరిపాటిగా మారిందని దీనికి ప్రజలే రానున్న కాలంలో సరైన బుద్ది చెప్తారని సత్యానందరావు అన్నారు.
ఈకార్యక్రమంలో రావులపాలెం క్లస్టర్3 టీడీపీ నాయకులతో పాటు రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!