రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో దివ్యాంగులకు బస్ పాస్ ల జారీ మేళా నిర్వహించనున్నట్లు సిరిసిల్ల డిపో మేనేజర్ ఎన్. మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం సిరిసిల్ల కొత్త బస్టాండ్ లోని బస్ పాస్ కౌంటర్ లో శనివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు.సదరం సర్టిఫికెట్ లో లోకో మోటర్/ఆర్ధో 40 శాతం మించి ఉండాలని, వినికిడి, దృష్టిలోపం ఉన్నవారికి 100% ఉండాలని, మెంటల్ రిటార్టేషన్ ఉన్న వారి ఐక్యూ 69 శాతం కంటే తక్కువ ఉండాలని తెలిపారు. దివ్యాంగులు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, సదరం సర్టిఫికెట్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఐడి కార్డ్ సర్వీస్ ఛార్జ్ కొరకు రూపాయలు:50/- యాభై రూపాయలు తీసుకొని సిరిసిల్ల కొత్త బస్టాండ్ లో నిర్వహించు *దివ్యాంగుల బస్ పాస్ స్పెషల్ క్యాంప్ మేళా* నందు పి హెచ్ సి బస్ పాస్ లను పొందాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!