డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అక్రమ అరెస్టుతో రిమాండులో వున్న తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు న్యాయం చెయ్యాలని న్యాయదేవతను కోరుతూ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు వినూత్న నిరసన తెలియజేశారు.
చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా రావులపాలెం నందు పదమూడవ రోజు క్లస్టర్ – 1 లోని బొబ్బర్లంక, పేరవరం, రాజవరం, ఉచ్చిలి, వెలిచేరు, వద్ధిపర్రు, వసంతవాడ, ఆత్రేయపురం, తాడిపూడి గ్రామాలవారు దీక్షలో కూర్చోవడం జరిగింది.
ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో అన్యాయం, అధర్మం రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజారెడ్డి రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం రావాలని నినాదాలు చేశారు.
నలబై యేళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదని కేవలం రాజకీయ కక్షతోనే అధినేత చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడుకి న్యాయం చెయ్యాలని న్యాయదేవతను కోరుతున్నామని ఏ తప్పూ చేయని చంద్రబాబు నాయుడుకి న్యాయదేవత తప్పకుండా న్యాయం చేస్తుందని ఆకాంక్షించారు.
ఆత్రేయపురం మండలపార్టీ అధ్యక్షుడు, క్లస్టర్1 ఇంఛార్జీ ముదునూరి వెంకట్రాజు, రాష్ట్ర TNTUC కార్యనిర్వాహక కార్యదర్శి, క్లస్టర్1 ఇంఛార్జీ ముళ్ళపూడి భాస్కరరావుల పర్యవేక్షణలో జరిగిన ఈ దీక్షకు రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, అధిక సంఖ్యలో క్లస్టర్1 గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!