ములుగు గడ్డ నాగజ్యోతి అడ్డ అని మహబుబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మలోతు కవిత అన్నారు .బుధువారం నాడు మండల కేంద్రం లో జరిగిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ములుగు జడ్పీ చైర్మన్ ,ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి ,ములుగు జిల్లా అద్యక్షులు కాకుల
మర్రి లక్ష్మణ్ రావు లతొ కలిసి హజరయ్యారు .తొలుత గుంజేడు ముసలమ్మ తల్లీ దేవాలయం ప్రత్యేక దర్శనం చేసి ద్వి చక్ర వాహనలతో భారీ ర్యాలీ తో కొత్తగూడ అంగడి ప్రాంగణం లో మండల అద్యక్షుడు కొమ్మనబోయిన వేణు అద్యక్షతన నిర్వహించిన సమావేశం లో ఎంపి కవిత మాట్లడుతూ ఏజెన్సీ ప్రాంతలైన కొత్తగూడ ,గంగారం ప్రాంతల అభివృద్ది చేసింది బి అర్ ఎస్ ప్రభుత్వమేనని ,గిరిజనులకు పోడు హక్కు పత్రాలు ఇచ్చిన ఘనత కెసిఆర్ దేనని ,ప్రతిపక్ష నాయకులపని ములుగు కు అవసరం లేదని ,ములుగు గడ్డ మీద ఈ సారి గులాబీ జెండ ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు .నాగజ్యోతి మాట్లడుతూ ఎజెన్సీ ప్రాంతల అభివృద్ది పై కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉందని ,ఈ ప్రాంతల ప్రజలకు సాగు నీటి సౌకర్యాన్ని కల్పించి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటానని ,బి అర్ ఎస్ ప్రభుత్వం రోడ్డులు మంజురు చేసిందని ,ఉద్యమం కుటుంబం నుండి వచ్చిన బిడ్దనాని నిరుపేద కుటుంబానికి చెందినదానినని ,ఎన్నికలల్లో ఒక రూపాయీ పెట్టకుండా ప్రతి గడప ,గడప తిరిగి కొంగు తో జోలెకట్టుకొని ఓట్లు అభ్యర్థిస్తానని ,ఎజెన్సీ ప్రాంతం లో ఉంటున్న ప్రజలు మీ ఇంటి ఆడ బిడ్డ గా ఆదరించాలని కొరారు .లక్ష్మణ్ రావు మాట్లడుతూ నాగజ్యోతిని గెలిపించి కెసిఆర్ కు ములుగు అసెంబ్లీ సీటు బహుమానం గా ఇవ్వడానికి కార్యకర్తలకు సమయం వచ్చిందని అన్నారు .
కాంగ్రెస్ ,బిజెపి ,న్యూడెమొక్రసీ నుండి బి ఆర్ ఎస్ లో కి చేరిక:
కొత్తగూడ మండల కేంద్రం లో నిర్వహించిన కార్యకర్తల సమవేశం లో కొత్తగూడ ఉప సర్పంచ్ ,రామన్నగూడం ఉపసర్పంచ్ ,దుర్గరామ్ ,ముస్మీ ,ఘాంధీనగర్ ,గుంజేడు ,కోనాపూర్ ,సాదిరెడ్డి పల్లి , తదితర గ్రామాలనుండి భారీగా బి ఆర్ ఎస్ కి చేరారు .వీరికి ఎంపి కవిత ,బడే నాగజ్యోతి ,లక్ష్మణరావు లూ గులాబి కండువ కప్పి స్వాగతించారు .ఈ కార్యక్రమం లో ఒడిసిమ్స్ ఉపాద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,అదికార ప్రతినిథి నెహ్రు ,మొకాళ్ళ సంతోషారాణి ,రజిత రమేశ్ ,దస్తగిరి ,సిరిగిరి సురేశ్ ,అశోక్ నాయక్ ,మోహనరావు ,నరేశ్ ,గట్టయ్య ,సుళ్ళూరి సారంగపాణి ,జిమ్మిడి శ్రీను ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు
[zombify_post]