-ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేసుకోవాలి.
ఈ నెల 27 న ఎల్లారెడ్డిపేట మండలము లో ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క గణపతిని నిమజ్జనం చేయాలని స్థానిక సీఐ శశిధర్ రెడ్డి,ఎస్.ఐ రమాకాంత్ వినాయక మంటపాల నిర్వాహకులను కోరారు.ఈ సందర్భంగా వినాయకుల నిమజ్జనం కోసం ఎల్లారెడ్డిపేట లో గల గిద్దే చెరువును వారు మంగళవారం పరిశీలించారు.ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి గణపతుల నిమజ్జనం కోసం క్రేన్ తెప్పించడం జరుగుతుందని లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందనీ అన్నారు. సీఐ,ఎస్ఐ వెంట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్ సతీష్ పంచాయతీ కార్యదర్శి దేవరాజు, గ్రామపంచాయతీ హెల్పర్లు సతీష్,హబీబ్ ఉన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!