డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
కొత్తపేట: మండలంలోని వాడపాలెం పాత మార్కెట్ వీధి శ్రీఆది గణపతి నవరాత్ర ఉత్సవ పందిరిలో సోమవారం రాత్రి దేవనర్తకి, సత్యహరిశ్చంద్ర (కాటి సీను) పౌరాణిక నాటకాలు ప్రదర్శన ఏర్పాటు చేసి నట్టు ఉత్సవ కమిటీ సభ్యుడు గనిశెట్టి చంద్రశేఖర్ తెలి పారు. ఏటా వాడపాలెంలో గనిశెట్టి చంద్రశేఖర్, బం డారు భాస్కరరావు, సింగిరెడ్డి గోవిందుస్వామి, కురచ ప్రకాశరావు తదితర కమిటీ సభ్యులు, కళాపోషకులు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో నాటక, సాంస్కృతిక ప్రదర్శనలు పునరుద్ధ రించిన విషయం తెలిసిందే. విధిగా ప్రస్తుత రంగస్థల రారాజు, అభినవ హరిశ్చంద్రుడిగా ఖ్యాతిఘడించిన జూనియర్ డీవీ సుబ్బారావును ప్రత్యేకంగా తీసుకు వచ్చి సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది విభి న్నంగా తొలుత దేవనర్తకి, అనంతరం సత్యహరిశ్యంద్ర (కాటిసీను) నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. జూనియర్ డీవీ సుబ్బారావు దేవనర్తకిలో భవానిశంక రుడు, హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు పాత్రలు పోషి స్తుండగా, కడప రత్నశ్రీ దేవనర్తకి, చంద్రమతిగా, జబర్దస్త్ అప్పారావు సుబ్బారావుగా, ఇతర పాత్రల్లో ప్రముఖ రంగస్థల నటులు నటిస్తున్నారు. కళాభిమా నులు, కళా పోషకులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి రెండు నాటక ప్రదర్శనలను జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.
This post was created with our nice and easy submission form. Create your post!
