రాజమండ్రి బ్రిడ్జిని నెల రోజుల పాటూ మూసివేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈనెల 24న కామన్ మేన్ న్యూస్ లో ప్రచురితమైన ” అమ్మో … రోడ్డు కం రైలు బ్రిడ్జి పై ప్రయాణం” వార్తకు అధికారులు స్పందించారు. వయాడక్ట్ భాగం, రోడ్డు కమ్‌లోని అప్రోచ్‌లతోపాటు దెబ్బతిన్న సెకండరీ జాయింట్‌ల మరమ్మతుల నిమిత్తం ఈ నెల 27 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు రోడ్డు కం రైలు వంతెనపై నెల రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ కె.మాధవి లత తెలిపారు. ఈ అత్యవసర మరమ్మతుల కోసం ట్రాఫిక్‌ను మళ్లించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. క్యారేజ్‌వే పునరుద్ధరణకు దాదాపు 4.5 కిలోమీటర్ల మేర బి.టి. (బ్లాక్ టాప్ రోడ్) వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లతో సహా, సెకండరీ జాయింట్‌ల వద్ద జియో-గ్లాస్ గ్రిడ్‌ల ప్రత్యేక మరమ్మత్తు పనులు రూ.210 లక్షలతో పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులను పోలీసు, రవాణా శాఖల అధికారులు పర్యవేక్షించాలని ఆమె తెలిపారు. APSRTC బస్సులను కూడా ప్రత్యామ్నాయ రూట్లలో నడపాలని ఆదేశించారు.
This post was created with our nice and easy submission form. Create your post!