తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసన గా ఆదివారం రాత్రి విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు నిర్వహిస్తున్న కొవ్వొత్తుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు . శాంతియుతంగా నిర్వహించబోయిన నిరసన ర్యాలీని అడ్డుకొని మహిళలు అందర్నీ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రజాస్వామ్య విధానాలు పై అవగాహన లేని వ్యక్తి పాలకుడు గా ఉంటే ఇలాంటి నిరంకుశ నిర్ణయాలతోనే ప్రజలను ఇబ్బంది పెడతారు అనడానికి ఈ అక్రమ నిర్భందమే ఉదాహరణ అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.
This post was created with our nice and easy submission form. Create your post!