డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు లోని తెలుగు రచయితల నేపథ్యంలో యువ రచయిత గొడవర్తి శ్రీనివాస్ రచించిన “ఆలమూరోళ్ల కథలు” పుస్తక ఆవిష్కరణ హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆవరణలో అతిరధ మహారధుల సమక్షంలో పుస్తకావిష్కరణ అంగ రంగ వైభవంగా నిర్వహించారు. పుస్తక ఆవిష్కరణ పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్, ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు సమక్షంలో జరిగింది.
తెలుగు సాహిత్యంలో ఆలమూరు రచయితల పాత్ర అద్వితీయమని పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్ వ్యాఖ్యానించారు. కథా సాహిత్యంలో ఆలమూరు రచయితల పాత్ర ఎంత ఉన్నతమైనదో ఈ పుస్తకం ద్వారా తెలుస్తుందని ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాదులోని సామాజిగూడ ప్రెస్ క్లబ్లో రచయిత గొడవర్తి శ్రీనివాసు సంపాదకత్వంలో వెలువడిన ఆలమూరోళ్ల కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆలమూరు గ్రామంలో జన్మించి ఉన్నత స్థానానికి ఎదిగి దూరదర్శన్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ సత్యవోలు సుందర సాయి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రముఖ సినీ నటుడు జెన్నీ, యువ కథ రచయిత కుప్పిలి సుదర్శన్, సాహితీ విమర్శకుడు కే మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన 14 మంది రచయితల కథలతో వెలువడిన ఈ పుస్తకం తెలుగు సాహిత్యంలో ఎందరో గొప్ప రచయితలకు జన్మనిచ్చిన ఆలమూరు గ్రామం కీర్తిని అజరామరం చేస్తుందని పలువురు వ్యాఖ్యానించారు
.
This post was created with our nice and easy submission form. Create your post!