వగళం యాత్ర’ వచ్చే వారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. యువగళం పాదయాత్ర ఇక్కడి నుంచి కొత్త మలుపు తీసుకుంటుందని… ప్రజల నుంచి మరింత ఊపు వస్తుందని తెలుగుదేశం యువ నేత లోకేష్ భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూ.గో. జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్ ఇవాళ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ ను అరెస్టు చేయాలని ఆలోచనతో జగన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నా… అరెస్టుకు వెరవకుండా మళ్లీ యువగళం మొదలుపెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.