కెసిఆర్ ప్రభుత్వం నరక కూపంగా మారిందని, కెసిఆర్ తీరుతో నిరుద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అభ్యర్థుల జీవితాలతో సిఎం కెసిఆర్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.