పాడేరు సెప్టెంబరు 22 : రాజ్యాంగంలో పొందిపరిచిన గిరిజన హక్కులను పరిరక్షించి, గిరిజనులకు సత్వర న్యాయం చేయడానికి జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పడిందని జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు అనంత నాయక్ స్పష్టం చేసారు. ఆయన రెండు రోజుల పట్యనలో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిద గిరిజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయన హిందీలో మాట్లాడుతుంటే జిల్లా కలెక్టర్ తెలుగులోకి అనువదించారు. స్థానిక నేతలు తెలుగులో మాట్లాడితే హిందీలోకి అనువదించి కమీషన్ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమీషన్ సభ్యులు మాట్లాడుతూ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. నిర్ధిష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కమీషన్ పరిస్కరిస్తుందన్నారు. గిరిజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చెప్పిన సమస్యలను విన్నారు. దేశంలో ఎన్నో రకాల కేసులు ఉన్నాయన్నారు. కేసులు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ రూ.183 కోట్లతో పెట్రలో బంకులు ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉందని గిరిజనులు బంకులు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని చెప్పారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లడుతూ నిజమైన ఫిర్యాదులు వస్తే తప్పకుండా విచారణ చేపట్టి తగిన చర్ లు తీసుకుంటామని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జె ఎసి జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఉపకలెక్టర్ కార్యాలయాన్ని బలోపేతం చేయాలని కోరారు. పరిపాలనా యంత్రాంగం ఏజెన్సీ చట్టాలకు లోబడి పనిచేయాలన్నారు. రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ సంఘం జి. ఓ నెం.3ని సుప్రీం కోర్టు కొట్టేసిందని దాని వలన గిరిజన ఉద్యోగులకు పదోన్నతులలో నష్టం వాటిల్లు తుందన్నారు. అల్లూరి సీతా రామ రాజు జిల్లా గిరిజన ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు నీల కంఠం మాట్లాడుతూ షెడ్యూలు 5లో భారత రాజ్యాంగ కల్పించిన హక్కులను కచ్చతంగా అమలు చేయాలని చెప్పారు. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మఖిసేషాద్రి మాట్లాడుతూ అల్లూరి సీత రామ రాజు జిల్లాను జోన్ 1 లోనే కొన సాగించాలని కోరారు. అనంతరం గిరిజన సంఘాల నేతల నుండి ఫిర్యాదులు స్వకరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాసు, ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్, అదనపు ఎస్పీ పి.అనిల్, కమిషన్ అధికారులు, వివిద గిరిజన సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!