- కాంగ్రెస్ తొలి జాబితాలో 35 మందికి దక్కనున్న టికెట్
- ఈ నెలాఖరుకు విడుదల చేయాలని కాంగ్రెస్ శ్రీని కమిటీ నిర్ణయం
- ఇద్దరు పోటీ పడుతున్న చోట అక్టోబర్ తొలి వారంలో ప్రకటన
- టికెట్ రాని అభ్యర్థులకు అధిష్టాన పెద్దలతో హామీలు
- అక్టోబర్ రెండో వారానికల్లా మొత్తం అభ్యర్థుల ప్రకటన
- గత ఎన్నికల్లో మూడుసార్లు ఓడిన చోట అభ్యర్థులను మార్చాలని సమావేశంలో నిర్ణయం
- షార్ట్ లిస్టు లోకి కనీసం 35% గెలుపు అవకాశమున్న పేర్లు
- ఖమ్మం జిల్లా టికెట్లపై పొంగులేటి విజ్ఞప్తిలు
- అక్టోబర్ రెండో వారానికల్లా పూర్తిస్థాయి జాబితా
సెప్టెంబర్ 23:
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం వేగంగా తొలి జాబితా తో కాంగ్రెస్ పార్టీ. ఈ నెలాఖరులోగా అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి జాబితా లో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న 30–35 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
తొలి జాబితాలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీతక్క, పొదెం వీరయ్య, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, జీవన్‌రెడ్డి, జి.వినోద్, షబ్బీర్‌అలీ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఫిరోజ్‌ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావు, అంజన్‌కుమార్ యాదవ్, పద్మావతిరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, విజయరమణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వంశీకృష్ణ తదితరులు పేర్లు ఉండొచ్చని అంచనా.
-
అక్టోబర్ రెండో వారానికి పూర్తి జాబితా.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి భేటీ జరిపిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. గురువారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రెండో భేటీ నిర్వహించింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, ఎన్నికల వ్యూహకర్త సునీల్, ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు. ఎనిమిది గంటల పాటు జరిగిన భేటీలో 119 నియోజకవర్గాల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 300 పేర్లపై చర్చించారని తెలిసింది.
ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలు 30–35 వరకు ఉండగా…ఇద్దరి పేర్లున్న స్థానాలు 20–30, ముగ్గురి చొప్పున ఉన్నవి 30–35, నలుగురు, ఆపైన పోటీపడుతున్న స్థానాలు 10–15 వరకు ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఒకే అభ్యర్థి ఉన్న జాబితాకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తీసుకుని.. ఈ నెలాఖరులోగా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం. అక్టోబర్ తొలివారంలో రెండో జాబితా, రెండో వారంలో తుది జాబితా ప్రకటించాలని యోచనకు వచ్చినట్టు తెలిసింది.గత ఎన్నికల్లో మూడుసార్లు ఓడిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. ఇలాంటి నియోజకవర్గాలు 6 నుంచి 8 వరకు ఉన్నట్టు సమాచారం.
సర్వేల ఆధారంగా..
స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ చేసిన సర్వేల నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఇద్దరు, ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీపడుతున్న స్థానాల్లో ఎవరెవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయన్న వివరాలను సమావేశంలో తెలియజేసినట్లు సమాచారం .
దీనిని పరిగణనలోకి తీసుకున్న కమిటీ నేతలు.. అందులో నియోజకవర్గాల వారీగా 35 శాతానికిపైగా గెలుపు అవకాశాలున్న నేతల పేర్లను పరిగణనలోకి తీసుకుంటూ షార్ట్ లిస్ట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. మరోవైపు బీజేపీ నుంచి చేరికలు ఉంటాయన్న అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చింది. అలా చేరే అవకాశమున్న స్థానాలకు అభ్యర్థుల ప్రకటనను వారం పాటు పెండింగ్‌లో పెట్టాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
టికెట్ దక్కని నేతలకు… అధిష్టాన పెద్దలతో హామీలు!
టికెట్ ఆశించి దక్కని నేతలకు వారి ప్రాధాన్యాన్ని బట్టి నేరుగా హైకమాండ్ పెద్దలతో పార్టీ, ప్రభుత్వ పదవులపై హామీలు ఇప్పించాలని స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ పదవులతోపాటు పార్టీలో ప్రాధాన్యం కల్పించే విషయాన్ని పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీలతో చెప్పించనున్నారని సమాచారం. కాగా, టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడే మకాం వేసి ముఖ్య నేతల ఆశీర్వాదం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పొంగులేటి తన వర్గం నేతలకు ఆరు చోట్ల ప్రాధాన్యం కోరినట్టు సమాచారం!
స్క్రీనింగ్ కమిటీ భేటీ ముందు ఠాక్రే, రేవంత్, ఉత్తమ్, భట్టిలతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తన అభి ప్రాయాలను నేతలకు పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి వివరించి నట్టు తెలిసింది. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజ కవర్గాల్లో తన వర్గం నేతలకు అవకాశం ఇవ్వా లని ఆయన కోరినట్టు సమాచారం. తనతో పాటు పార్టీలో చేరిన తుడి మేఘారెడ్డికి వనపర్తిలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. సర్వేలతో పోల్చి చూసి ఖరారు చేస్తామని ఠాక్రే హామీ ఇచ్చినట్టు తెలిసింది.
This post was created with our nice and easy submission form. Create your post!