ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
నాయుడు అరెస్టుకు నిరసనగా కేంద్రమైన చర్లలో బుధవారం టిడిపి, బిఆర్ఎస్, కాంగ్రెస్, అభిమానులు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ బొమ్మ వరకు అక్కడ నుండి పోలీస్ స్టేషన్ సూపర్ బజారు రోడ్డు వరకు కొవ్వొతులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే చంద్రబాబును రిలీజ్ చేయాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చంద్రబాబును కక్షపూరితంగానే అరెస్టు చేశారని, ప్రజలకు సేవలు అందించి 15 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేతను ఆయనకు సంబంధం లేని కేసులు ఇరికించి జైలుకు పంపడం దారుణం అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగంలో చంద్రబాబు అభివృద్ధి చేశారని ఆయన అక్రమ అరెస్ట్ లను నిరసనగా ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారని నాయకులు తెలిపారు.
[zombify_post]