చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
చంద్రబాబు తరపున హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేయగా ఇవేళ విచారణకు వచ్చింది, పిటిషన్ పై ఏపీలో విచారణ వాయిదా పడింది.
చంద్రబాబు తరపున హైకోర్టులో సిద్ధార్ధ లూథ్రా, అగర్వాల్, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఏఏపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.