
in Main News
జాతీయగీతంతో కొత్త భవనం ప్రారంభం

జాతీయగీత ఆలాపనతో కొత్త భవనం ప్రారంభమైంది. తన తొలి ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ..నూతన పార్లమెంట్ భవనంలోకి అందరికీ స్వాగతం పలుకుతున్నానని అన్నారు. ఈరోజు అనేక విధాలుగా అపూర్వమైనదని, అమృతకాలంలో కొత్త లక్ష్యాలతో ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందడుగు వేయబోతున్నామని స్పష్టం చేశారు ప్రధాని. వినాయక చవితి సందర్భంగా ప్రారంభించిన ఈ పార్లమెంటును మన సరికొత్త సంకల్పానికి సాధించే ఆలోచనతో ప్రారంభించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

