వాజేడు మండల పరిధిలోని ధర్మవరం, అయ్యవారిపేట గ్రామాల్లో సోమవారం గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ చత్తీస్గడ్ రాష్ట్రం నుంచి వచ్చి గుడుంబా విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సుమారు 89 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా గుడుంబా విక్రయించినా, తయారు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
[zombify_post]