in , ,

నేడు చంద్రబాబు రిమాండ్ ఉత్తర్వులపై విచారణ

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, FIR స్క్వాష్‌పై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.స్కిల్ డెవలప్మెంట్  కేసు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు బెయిల్‌పై కూడా హైకోర్టు విచారణ చేపట్టనున్నది.రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్‌పై CID తరపున.. సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించే అవకాశం ఉంది.వర్చువల్‌గా రోహత్గీవాదనలు ఉంటాయని సమాచారం. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారు.మరో సీనియర్ న్యాయవాది కూడా చంద్రబాబు తరపున హాజరవుతారని సమాచారం.విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు బెయిల్,.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌లపై హైకోర్టు విచారణ చేపట్టనున్నది. ఈ విషయంపై కౌంటర్‌ దాఖలు చేయాలని CIDకి ACB కోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు నిర్ణయం తర్వాత ACB కోర్టులో ఈ కేసుపై మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

[zombify_post]

Report

What do you think?

విశాఖ లో భారీ వర్షం: యువకుడికి తీవ్ర గాయాలు

నేడు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు