in , ,

చంద్రబాబు ఆరోగ్యం పై భువనేశ్వరి పూజలు

రాజమహేంద్రవరం : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఆరోగ్యం కోసం నారా భువనేశ్వరి, మాజీ  హోం మంత్రి,  పెద్దాపురం శాసనసభ్యులు  చినరాజప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి  శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సోమవారం ఉదయం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి పూజలు చేశారు.చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు  చినరాజప్ప, అధిక సంఖ్యలో  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ప్రళయ్ క్షిపణులను కొనేందుకు రక్షణ శాఖ ఆమోద ముద్ర

Nasa

సూర్యుడు ఇలా ఉంటాడేమో.. నాసా