ఒడిశాలో స్క్రబ్ టైఫస్ హడలెత్తిస్తోంది, ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి ఏడుగురు చనిపోయారు. తాజాగా సుందర్ గడ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 59శాంపిల్స్ ను టెస్ట్ చేయగా 11 మందికి స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో ఒడిశా రాష్ట్రంలో మొత్తం స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 180కి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాగా, ఎవరికైనా 4 లేదా 5 రోజులు పాటు జ్వరం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
