తెలుగుదేశం పార్టీ ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ.చంద్రబాబు అక్రమ అరెస్టుని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి 38 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, గత తొమ్మిదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని, రాజకీయ నాయకులకు సంబంధించిన క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసుల్ని పార్లమెంటులో ప్రస్తావిస్తావించాలని సమావేశంలో నిర్ణయించారు.