in , , ,

విజయనగరం క్రీడా విభాగం”

ఆటలకు నిలయమైన ఉమ్మడి విజయనగరం జిల్లాలో క్రీడా వికాసం మసకబారింది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. ప్రతి నియోజకవర్గానికి ఒక్కో మినీ స్టేడియం (ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు) మంజూరు చేసింది

ఆటలకు నిలయమైన ఉమ్మడి విజయనగరం జిల్లాలో క్రీడా వికాసం మసకబారింది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. ప్రతి నియోజకవర్గానికి ఒక్కో మినీ స్టేడియం (ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు) మంజూరు చేసింది. శాప్ ఆధ్వర్యంలో 2016–17లో ఒక్కో కేంద్రానికి రూ.2 కోట్లు కేటాయించింది. అయిదెకరాలు ఉన్న చోట పనులుప్రారంభించింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టింది. నాలుగేళ్లవుతున్నా ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది.

*ఎస్. కోట నియోజకవర్గ పరిధి కొత్తవలసలో పునాదులు తీశారు. పిల్లర్లు వేయడానికి ఇనుప చువ్వలు కట్టారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో నిధులివ్వక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కొంతకాలం కిందట డిజైన్ మారిందంటూ ఇనుప చువ్వలు కోసి గుత్తేదారు పట్టుకుపోయారు. చీపురుపల్లి – గరివిడి మధ్యలో చేపట్టిన పనులు తెదేపా హయాంలోనే 50 శాతం పూర్తయ్యాయి. ఈ నాలుగేళ్లలో ఇసుమంత ప్రగతి కూడా లేదు. బొబ్బిలి నడిబొడ్డున అనుకూలమైన భూమి ఉన్నా పనులు ప్రారంభించలేదు. గజపతినగరం నియోజకవర్గ పరిధి గంట్యాడలో గుర్తించిన స్థలం వివాదాల్లో ఉండటంతో వదిలేశారు. డెంకాడ మండలం మోదవలసలో పునాదులు తీసి పది శాతం పూర్తి చేసి ఆపేశారు. పార్వతీపురంలోని రైతుబజారు సమీపంలో స్థలం చూశారు. అది చెరువు కావడంతో అనుకూలంగా లేదని విడిచి పెట్టేశారు. సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పనుకువలస సమీపంలో జాతీయ రహదారి పక్కన అయిదెకరాలు పరిశీలించారు. సాలూరు పాచిపెంట మధ్య గిరిజన క్రీడాకారులకు అన్ని విధాలాఅనుకూలంగా ఉంటుందని భావించారు. చివరకు కొండప్రాంతం కావడంతో పనులు ప్రారంభించలేదు. గుమ్మలక్ష్మీపురంలో ఐటీడీఏ నిధులతో నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించినా ఆ దిశగా అడుగులు వేయలేకపోయారు. విజయనగరంలో చాలా మైదానాలు ఉండటంతో క్రీడా వికాస కేంద్రం అవసరం లేదని అధికారులు భావించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమవుతుందని విజయనగరంలో ఆదర్శ క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. ఇందులో 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలనుకున్నారు. 2017-18లో రూ.20 కోట్ల వ్యయంతో ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. విజ్జీలో పాఠశాల నిర్మాణానికి స్థలం సైతం కేటాయించారు. భవనాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రం నలుమూలల నుంచి 40 మంది విద్యార్థులు వచ్చి చేరారు. పాఠశాల నిర్వహణకు రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. 11 మంది ఉద్యోగులను నియమించారు. ముగ్గురు ఉపాధ్యాయులను తీసుకున్నారు. మంజూరు చేసిన నిధులతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంతలో ప్రభుత్వం మారింది. 20 శాతం లోపే పనులు జరిగినందున ఆపేయాలని ఆదేశించింది. నిధుల సమస్య చూపి క్రీడా పాఠశాలను ఎత్తివేసింది. విద్యార్థులను వారిళ్లకు పంపించింది. ఉద్యోగులను తొలగించింది. ఉపాధ్యాయులను మాతృ సంస్థకు అప్పగించింది. దీంతో నిర్మాణ పనులు పునాదుల దశలో నిలిచిపోయి వెక్కిరిస్తున్నాయి.

ఒకటి పడక.. మరొకటి నడక-:

రాష్ట్రంలో ఆరు క్రీడా శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు. వాటిలో గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరిలో బాలికలకు
అథ్లెటిక్స్, ఆర్చరీ, ఫుట్బాల్, బాక్సింగ్, సీతంపేటలో బాలురకు అథ్లెటిక్స్, హాకీ, జూడో, బాస్కెట్బాల్, వెయిట్రిఫ్టింగ్ క్రీడా విభాగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. భద్రగిరిలో 2021లో సుమారు వంద మందికి ప్రవేశాలు కల్పించారు. సుమారు 450 మంది బాలికలు ఉన్న పాఠశాల ఆవరణలోనే వీరికీ వసతి కల్పించారు. వసతి చాలక ఆ తర్వాత వరుసగా రెండేళ్లు ప్రవేశాలు నిలిపివేశారు. అప్పటికే ఉన్న బాలికలకు వారికి ఇష్టమైన ప్రాంతాలకు సాగనంపారు. సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ఇండోర్లో విడతల వారీగా జిమ్, షటిల్ బ్యాడ్మింటన్,టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్.. అవుట్ డోర్లో బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, 200 మీటర్ల అథ్లెటిక్ (పరుగు) ట్రాక్ నిర్మించారు. ఉన్నంతలో ఇదొక్కటే ఆశాజనకంగా నడుస్తోంది.

తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నాలుగు జల క్రీడా అకాడమీల్లో తాటిపూడి జలాశయం ఒకటి. సమీపంలో అకాడమీ భవన నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేశారు. కొంత పని జరిగిన తర్వాత ప్రభుత్వం మారడంతో దీని వైపు తొంగిచూసే వారే కరవయ్యారు.

రాష్ట్ర క్రీడా పాఠశాల అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. త్వరలో దీనిపై సమీక్షిస్తారు. మల్టీపర్పస్ మైదానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరిగాయి. శాప్ నుంచి, ఇతర విభాగాల నుంచి నిధులు సమీకరించి అందిస్తాం. ఇటీవలే గుత్తేదారు నిర్మాణ సంస్థకు చెందిన ప్రతినిధులు పరిశీలించి వెళ్లారు. చీపురుపల్లి, బొబ్బిలిలో క్రీడా వికాస కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

ఏ ముఖం పెట్టుకుని వచ్చావంటే ఏం చెప్పను#

స్టీల్ ప్లాంట్ అమ్మకం నుండి కేంద్ర బిజెపి వెనక్కు తగ్గేవరకు ఉద్యమించాలి