in , ,

ఏ ముఖం పెట్టుకుని వచ్చావంటే ఏం చెప్పను#

విజయనగరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు అధ్యక్షతన శనివారం ఎస్. కోట అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి సమీక్ష నిర్వహించారు.

రోడ్డు గుంతలపై ఎమ్మెల్యే ఆవేదన*

విజయనగరం  జిల్లా ఇన్ఛార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు అధ్యక్షతన శనివారం ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి సమీక్ష నిర్వహించారు. కొత్తవలస ప్రధాన రహదారిలో గుంతలపై ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆవేదనను వెళ్లగక్కారు. గుత్తేదారుతో అడ్వాన్గా పని చేయించి ఉండాల్సిందంటూ.. ఎమ్మెల్యే చెప్పిన దానిని బట్టి తనకు అర్థమైందని మంత్రి అధికారులకుసూచించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గుంతలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడిన గుంతలు కాదంటూ ప్రతిపక్షంపైకి నెట్టారు. జరిగే పనులు జరుగుతాయని, ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను తీర్చుతూ ముందుకు పోతామన్నారు.

కొత్తవలస ఆర్అండ్ ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. నియోజకవర్గంలో గుత్తేదారులు.మాకంటే  మీకే బాగా తెలుసు. వారితో కనీసం బాగు చేయించలేకపోతున్నారు. గుంతలు పూడ్చలేకపోతే ఓటు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చావని ప్రజలు నన్ను నిలదీస్తే ఏమి సమాధానం చెప్పాలి?

గుంతల సమస్య ఇప్పుడిది కాదు. గడిచిన అయిదేళ్లలో విడిచిపెట్టినవి ఈరోజు పెద్దవయ్యాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడిన గుంతలు కావు. అప్పుడు వాళ్లు ఎందుకు పూడ్చలేదో? అడగకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారమేమిటి?

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం*

విజయనగరం క్రీడా విభాగం”