- భద్రాచలం నియోజకవర్గం వాజేడుకు చెందిన 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన బాలుడు సూత్రపు హరిచందర్ కు ఆదివారం ఉదయం గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామస్థులు కంటతడి పెట్టారు. పలువురు ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
[zombify_post]
