మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై పలువురు ప్రముఖుల స్పందించారు. ఈ క్రమంలో ఈ ఎపిసోడ్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్‌నే అడగాలని.. ఆయనే సమాధానం చెబుతారన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో స్పందించమని తాము ఎవరినీ కోరలేదని.. దీనిపై స్వచ్ఛందంగా స్పందించాలి అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని.. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారన్నారు. తాము ఎవరినైనా ఆందోళన చేయండి అని అడిగితే.. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అన్నారు. అంతకముందు ాస్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్్ణ కు సంబంధించి పూర్తి వాస్తవాలతో ఇవే అంటూ టీడీపీ వెబ్ సైట్‌ను ప్రారంభించింది. వెబ్ సైట్ లోని వివరాలు పరిశీలిస్తే, చంద్రబాబు ఏంచేశారో, యువత భవితకోసం ఎంతగా తపనపడి, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేశారో, ఈ ప్రభుత్వం ఏవిధంగా దుష్ప్రచారం చేస్తుందో ప్రజలకు తెలుస్తుందన్నారు అచ్చెన్నాయుడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని నిరూపించే వాస్తవాలను ప్రతిరోజు ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు. వెబ్ సైట్‌లో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వెనకున్న ఆవశ్యకత గురించి.. మొత్తం ప్రాజెక్ట్ అమలైన తీరును వివరించామన్నారు. దానివల్ల లబ్ధిపొందిన వారి వివరాలన్నీ పొందుపరిచామన్నారు. 2014 నవంబర్లో సిమెన్స్ సంస్థ నుంచి అప్పటి ప్రభుత్వానికి వచ్చిన ప్రతిపాదన మొదలు, తదనంతరం జరిగిన అన్ని పరిణామాలను వరుసక్రమంలో పూసగుచ్చినట్టు గా వెబ్ సైట్లో వివరించామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏపీలో టీడీపీప్రభుత్వం అమలుచేయకముందే దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేశాయన్నారు. చంద్రబాబు చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పనితీరు బాగుందని జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రశంసించిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సమర్థవంతంగా ప్రాజెక్ట్ అమలుచేసినందుకు గాను వచ్చిన అవార్డుని వైసీపీ ప్రభుత్వం స్వీకరించి, తానే అంతా చేసినట్టు చెప్పుకుందననారు. జగన్ రెడ్డి ఫోటోలతో పత్రికల్లో, ఇతర ప్రసారమాధ్యమాల్లో ప్రజలకు కనిపించేలా భారీగా హోర్డింగులు ఏర్పాటుచేశారన్నారు. ఇదంతా తామే చేసినట్టు ప్రచారం చేసుకున్నారన్నారు. అయినా దానిపై తాము స్పందించలేదని.. ప్రాజెక్ట్ అమలై యువత బాగుపడితే చాలని సంతోషించామన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాలు పరిశీలించకుండా టీడీపీ నేతల్ని ఎందుకు అడ్డుకుంటన్నారని ప్రశ్నించారు. కేంద్రాలకు ఎందుకు తాళాలేయిస్తున్నారని.. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రాల్లో ఎలాంటి పరికరాలు, సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం లేదని సీఐడీ, జగన్ ప్రభుత్వం ఎలా చెబుతుందన్నారు. శిక్షణా కేంద్రాల పరిశీలనకు వెళ్లకుండా టీడీపీ నేతల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని.. కాలేజీల యాజమాన్యాలను బెదిరించి, శిక్షణా కేంద్రాలకు ఎందుకు తాళాలేయిస్తున్నారో చెప్పాలన్నారు. ఇవన్నీ చూస్తే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా, అన్యాయంగా చంద్రబాబునాయుడిపై అభాండాలు వేసి, జైలుపాలు చేసిందో అర్థమవుతోందన్నారు.
[zombify_post]