- గొట్టా బ్యారేజీ
srikakulam "
'గొట్టా' నిర్మాణంలో ఆద్యుడు..
వంశధార పర్యవేక్షక ఇంజినీర్ 1974 నుంచి 76 వరకు పని చేసిన ఎం.ఎల్. స్వామి గొట్టా బ్యారేజీ నిర్మాణం, వంశధార ప్రధాన, పిల్ల కాలువల పనులు పూర్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో పనులు చేయించారు. హిరమండలం, ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాల్లో వంశధార అతిథి గృహాలు, ఉద్యోగులకు కార్యాలయాలు, క్యాంపు కాలనీలు ఏర్పాటు చేయించారు. గొట్టా బ్యారేజీ దిగువన కుడి, ఎడమ కాలువల ద్వారా సాగు నీరందించడంలో కీలకంగా వ్యవహరించారు. కరవుతో అల్లాడుతున్న జిల్లా రైతాంగానికి ఊరటనిచ్చారు.
చిక్కాల రాధామోహన్ పట్నాయక్ (సీఆర్ఎం పట్నాయక్) గొట్టా బ్యారేజీ రూపశిల్పిగా పేరొందారు. బ్యారేజీ నిర్మిస్తున్న సమయంలో ఈఈగా చేసేవారు. అప్పుడు ఆయన బ్యారేజీ డిజైన్లు వేశారు. అనంతరం 1980-83లో ఎస్ఈగా విధులు నిర్వర్తించారు. 1980లో వచ్చిన వరదలకు గొట్టా బ్యారేజీ గట్లు, కుడి, ఎడమ ప్రధాన కాలువల గట్లు కొట్టుకుపోయాయి. వాటిని పునఃనిర్మించేందుకు కృషి చేశారు. దీంతో పాటు కాట్రగడ్డ వద్ద నిర్మించిన సైడ్ ్వయర్, వరద కాలువల నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఈ ఏడాది ఆయన శత జయంతి ఉత్సవాలు చేయనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
అప్పట్లో గొట్టా బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఎడమ కాలువ ద్వారా పలాస, టెక్కలి, నరసన్నపేట, ఇతర మండలాల్లో శివారు ప్రాంతాలకు మాత్రమే సాగునీరందించేవారు. హిరమండలం, ఎల్ఎల్పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లోని రైతులు చెరువులపై ఆధారపడి సాగు చేసేవారు. 1998-2002 మధ్యలో ఎస్ఈగా విధులు నిర్వర్తించిన ఐఎస్ఎన్ రాజు ఆయా మండలాలకు కూడా లబ్ధి జరిగేలా కుడి ప్రధాన కాలువ నిర్మించి 60 వేల ఎకరాలకు సాగు నీరందించారు. వీటితోపాటు యరగాం, పురుషోత్తపురం, భైరి ఓపెన్ హెడ్ ఛానల్స్ ఏర్పాటుకు కృషి చేశారు. ఈయన తర్వాత 2003 నుంచి 2006 వరకు పని చేసిన జి.ప్రసాదరావు వంశధార రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఆయన కాలంలో వయోడక్ట్, రైల్వేక్రాసింగ్, హైవేక్రాసింగ్ పనులు జరిపించారు. కుడి కాలువ శివారు ప్రాంతాలైన శ్రీకాకుళం, గార మండలాల్లో మిగులు పనులు పూర్తి చేయించారు.
జిల్లాలో గతంలో పని చేసిన ఇంజినీర్ల స్ఫూర్తితో వంశధార నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే గొట్టా బ్యారేజీ దిగువన ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టి వంశధార
రిజర్వాయర్లో 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పనులు చేయించాలని నిర్ణయించాం. ఇటీవల
ముఖ్యమంత్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. వీలైనంత త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. పెండింగ్లో ఉన్న హెచ్ఎల్సీ, రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
[zombify_post]