[ప్రభుత్వ నిర్లక్ష్యం.. పేదలకు శాపం..!
అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబం సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అమలు చేసింది.
నిలిచిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు బిల్లులు చెల్లించక లబ్ధిదారులకు అవస్థలు న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్

అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబం సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తెదేపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అమలు చేసింది. లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంగా ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు. వారు నివాసముంటున్న పాకలు, రేకుల షెడ్లు కూలగొట్టి పనులు ప్రారంభించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బిల్లులు చెల్లించకపోవడంతో పునాదులకే పరిమితమయ్యాయి.
మెళియాపుట్టి గ్రామానికి చెందిన మల్లిపెద్ది శ్రావ్యకు ఎన్టీఆర్ గృహం మంజూరైంది. తొలివిడతగా పునాది బిల్లు రూ.30 వేలు మంజూరైంది. ప్రభుత్వం మారడంతో అప్పు చేసి నిర్మాణం పూర్తి చేశార ళియాపుట్టి గ్రామానికి చెందిన మల్లిపెద్ది శ్రావ్యకు ఎన్టీఆర్ గృహం మంజూరైంది. తొలివిడతగా పునాది బిల్లు రూ.30 వేలు మంజూరైంది. ప్రభుత్వం మారడంతో అప్పు చేసి నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటికీ మిగిలిన సొమ్ము రాకపోవడంతో లబ్ధిదారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెళియాపుట్టి మండలంలో 342 ఇళ్లదీ ఇదే పరిస్థితి.
హిరమండలం మండలం మర్రిగూడ పంచాయతీ కిరిడివలసకి చెందిన హడ్డుబంగి నాగభూషణరావుకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం సమకూర్చే రూ. 2 లక్షలతో సొంతిల్లు పూర్తవుతుందని ఆ కుటుంబం ఆశపడింది. మొదట్లో పునాది బిల్లు రూ.30 వేలు ఖాతాకు జమ చేశారు ప్రభుత్వం మారిన అనంతరం బిల్లు చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా నిర్మాణం పునాది
దశలోనే ఆగిపోయింది.
రూ.25 కోట్ల మేర బకాయిలు..
ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఒక్కో ఇంటికి గత ప్రభుత్వం రూ.1.50 లక్షలు మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా మరో రూ.50 వేలు సమకూర్చింది. చివరి దశలో మంజూరైన ఒక్కో ఇంటికి రూపాయి చొప్పున లబ్ధిదారు ఖాతాలో జమ చేసింది. మిగిలిన మొత్తాన్ని దశల వారీగా అందజేసింది. ప్రభుత్వం మారే సమయానికి సుమారు 30 వేల ఇళ్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని సమాచారం. వాటిలో కొన్నింటిని వివిధ కారణాలతో పక్కన పెట్టి 21,501 ఇళ్లకు మాత్రమే బకాయిలు ఉన్నట్లు చూపుతున్నారు. 19,736 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. మిగిలిన 1,765 మంది అర్హులైనప్పటికీ పక్కన పెట్టారు. సుమారు రూ. 25 కోట్ల మేర బిల్లులు బకాయిలున్నట్లు తెలిసింది. అవినీతి జరిగిందనే నెపంతో..
తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా సొంతిల్లు లేని పేదలనుఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి గత ప్రభుత్వం ఎంపిక చేసింది. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి జరిగిందనే నెపంతో పనులు నిలిపివేసింది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పేరిట కొత్త పథకం తీసుకొచ్చింది.
ఒక్క రూపాయి చెల్లించలేదు..
గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద వేల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేసింది. చివరి దశలో ఉన్న లబ్ధిదారులకు చాలావరకు బిల్లులు చెల్లించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎన్పీఐ సర్వే పేరిట చెల్లింపులు నిలిపివేసింది. నాలుగున్నరేళ్లుగా లబ్ధిదారులకు ఒక్క రూపాయి చెల్లించలేదు.శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడలో దశముఖ పార్వతమ్మకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం, పీఎంజేఏవై కింద రూ. 2 లక్షలు మంజూరుకాగా రూ.1.50 లక్షలు విడుదల చేశారు. ఇంటి నిర్మాణం స్లాబు దశకు చేరుకుంది. చివర బిల్లు రూ.50 వేలు అపరిష్కృతంగా ఉండటంతో నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది.
సర్వే పూర్తయింది..
గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరును ప్రీ ఎన్పీఐగా మార్చారు. అప్పట్లో మంజూరై బిల్లులు పూర్తిగా చెల్లించని ఇళ్ల సర్వే ప్రక్రియ పూర్తయింది. భౌతికంగా ఆయా ఇళ్ల పరిస్థితి పరిశీలించి.. అర్హులను గుర్తించాం. ఈమేరకు నివేదికను ప్రభుత్వానికి
[zombify_post]