కరీంనగర్ జిల్లా:
# యువత రాజకీయాలకు రావాలి.
# కార్పొరేట్ డబ్బు రాజకీయాలు మార్చాలి.
> కోమటిరెడ్డి తేజ దీప్ రెడ్డి
ఆల్ ఇండియా యూత్ లీగ్ ఇన్చార్జి.
ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనుబంధ యువజన సంఘం ఆల్ ఇండియా యూత్ లీగ్ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అధ్యక్షతన వాగేశ్వర్ డిగ్రీ కళాశాల హాలులో నిర్వహించడం జరిగినది.
ఆల్ ఇండియా యూత్ లీగ్ ఇన్చార్జి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి హాజరై మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా యువత రాజకీయాల్లోకి రావాలని, కార్పొరేట్ డబ్బు రాజకీయాలను మార్చాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు మీద పోటీ చేస్తామని అన్నారు. జిల్లాలో గెలుపోటములను మా పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి యువతను పెద్ద ఎత్తున మోసం చేశారని అన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కరణ చేస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలు రక్షణ కోసం యువత నడుం బిగించాలని అన్నారు. నిధులు నియమాకాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే యువతకు, నిరుద్యోగులకు నిరాశ ఏర్పడిందని అన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ ఇచ్చిందని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అనేది కేవలం కేసీఆర్ కుటుంబానికి పరిమితమైందని ఏద్దావా చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అనుబంధ సంఘాల అన్నింటినీ బలోపేతం చేస్తామని తెలిపారు. జిల్లాలో భూమా మాపియా చెలరేగిపోతుందని విమర్శించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కొత్త భూములను, ఖాళీ జాగలను కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారూ . దళిత బంధు, గృహలక్ష్మి పథకాలు టిఆర్ఎస్ కార్యకర్తలకు పథకాలుగా మారినాయని ఏద్దావా చేశారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, జాగ లేని వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు కోసం మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నగర కార్యదర్శి వసీం హైమద్, జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్, జి.ప్రశాంత్ కుమార్ యువజన సంఘ నాయకులు కె.బద్రి నేత, జె. రాజు, సాయికిట్టు, హరీష్, నయూబ్ ఖాన్, ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]