శనివారం రాళ్ళగూడెం నుండి చర్ల మండల కేంద్రం వరకు బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కూరపాటి వీర్రాజు, ఆధ్వర్యంలో ఇంటింటికి ఏనుగు గుర్తును ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ త్యాగాన్ని తెలియజేస్తూ ప్రచార బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇర్ప రవికుమార్ దొర మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో దొరల పార్టీ అయినా బిఆర్ఎస్ కు ఓటువేయకుండా అగ్రకుల మనువాద పార్టీలైన కాంగ్రెస్,బిజెపి లకు ఓటువేయకుండా, నిరంతరం అణగారిన వర్గాలైన BC/SC/ST, మొదలగు మైనార్టీల హక్కుల కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ ని బలపరిచి ఏనుగు గుర్తుకు ఓటువేసి మనకోసం, మన బహుజన సమాజం వైపు పోరాటం చేస్తున్న మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేయాలనీ కోరారు.మన అణగారిన వర్గాలైన BC/SC/ST వారందరు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ నల్లగట్ల రఘు, జిల్లా ఉపాధ్యక్షులు కేసుపాక వెంకట రమణ,జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిద దామోదర్ రావు, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ యాసం సిద్దార్థపూలే, నియోజకవర్గ అధ్యక్షులు సోడి వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి కొప్పుల రాంబాబు, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు కంచర్ల సింహాద్రి, వీసంపల్లి నాగేశ్వరావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]