పాడేరు, అల్లూరి జిల్లా: గిరిజను అరోగ్య రక్షణకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు వేగంగా పూర్తి చేయాలని ఐటిడిఏ పి ఓ వి. అభిషేక్ ఆదేశించారు. ఐటిడిఏ నిధులతో కొనుగోలు చేసిన ఐదు మైక్రో స్కోప్ యంత్ర పరికరాలను శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లకు పంపిణీ చేసారు. పెదబయలు, రాజంగి, ధారకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు, అరకు వ్యాలీ సహాయ మలేరియా అధికారి కార్యాలయానికి, జిల్లా మలేరియా అధికారి కార్యాలయానికి మైక్రో స్కోపులను కేటాయించామని చెప్పారు. మలేరియా పరీక్షలు, క్షయ నిర్ధారణ, మూత్ర పరీక్షలు, పులపరీక్షలు . వీర్యకణాలు పరీక్షలు చేయడానికి వినియోగించి సకాలంలో రిపోర్టులు ఇవ్వాలని సూచించారు. సీజనల్ వ్యాదులపట్ల అప్రమత్తంగా ఉంటూ రక్త పరీక్షలను చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పి. ఎస్. ఎస్. ప్రసాద్ , ల్యాబ్ టెక్నిషియన్లు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]