ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, లేకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్ హెచ్చరించారు.శ్రీకాకుళం నగరం, జలుమూరు, న్యూస్టుడే: జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, లేకుంటే బాధ్యులపై చర్యలు తప్పవని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్ హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో గృహ నిర్మాణ నిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ ఇంజినీరింగ్ కార్యదర్శులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రగతిలో జిల్లా మూడో స్థానంలో ఉందన్నారు. జిల్లాకు 75,840 ఇళ్లు మంజూరు చేయగా.. ఇప్పటి వరకు 25 వేల గృహాలు పూర్తి చేసినట్లు తెలిపారు. జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని.. సంతబొమ్మాళి, సోంపేట తదితర మండలాలు ఈ విషయంలో వెనుకంజలో ఉన్నాయని వివరించారు. కలెక్టర్ శ్రీకేష్ బి. లర్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గృహ నిర్మాణాలను లక్ష్యం ప్రకారం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తొలుత వివరించారు. కలెక్టర్ శ్రీకేష్ బి. లర్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గృహ నిర్మాణాలను
లక్ష్యం ప్రకారం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తొలుత జలుమూరు మండలం చల్లవానిపేట, లింగాలవలస వద్ద జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను మహమ్మద్ దివాన్ మైదీన్ పరిశీలించారు. ముఖద్వారం పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లా గృహనిర్మాణ సంస్థ పీడీ ఎన్. గణపతి, డ్వామా పీడీ ఎం. చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]