ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రథమ,ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఐడి కార్డులను శుక్రవారం అందజేశారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి పోలీసు శాఖ లో ఉద్యోగులుగా స్థిరపడిన పూర్వ విద్యార్థులు బోడ ప్రశాంత్ , శంకర్, ప్రదీప్ లు ఐడీ కార్డులకు 10వేలు విరాళంగా అందించారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందించడం జరుగుతుందని కళాశాల ఇంచార్జి ప్రధాన ఆచార్యులు క్యాతం సత్యనారాయణ, అధ్యాపకులు వాసరవేణి పర్శరాములు లు అన్నారు. విరాళం అందించిన పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు చెరుకు భూమక్క, మాదాసు చంద్రమౌళి,బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, ఆర్.గీత, గౌతమి, బోధనేతర సిబ్బంది విమల్, దేవేందర్, తాజోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]